పెళ్లి గురించి స్పందించిన అఖిల్ ! | Filmibeat Telugu

2017-12-06 361

"I am not getting married for a very long time. My entire focus is on my career. Please pray for Hello to work. It’s my first major step towards making my parents proud by building a career like my father’s,” says Akhil Akkineni.

నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ తొలి సినిమా విషయంలో తెబ్బతిన్న సంగతి తెలిసిందే. దాంతో పాటు ఎవరూ ఊహించని విధంగా చిన్న వయసులోనే పెళ్లికి సిద్ధమై తాను ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ యంగ్ హీరో చివరి నిమిషయంలో పెళ్లి రద్దు చేసుకుని అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. తొలి సినిమా ప్లాప్, పెళ్లి డిస్ట్రబెన్స్ నుండి బయటపడి..... తన రెండో సినిమాతో మళ్లీ ఫ్రెష్‌గా కెరీర్ మొదలు పెట్టిన అఖిల్ డిసెంబర్ 22న 'హలో' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం ‘హలో' సినిమాకు సంబంధించిన పాట చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే ఇది ఇంట్రడక్షన్ సాంగ్ కాదని అఖిల్ తెలిపారు. ఈ పాట అవసరం అని దర్శకుడు, నేను చివరి నమిషంలో డిసైడ్ అయ్యామని, అందుకే ఈ పాటను షూట్ చేస్తున్నట్లు అఖిల్ వెల్లడించారు.నా తొలి సినిమా విషయంలో నేనేమీ బాధ పడటం లేదు. ఆ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాను.
‘హలో' మూవీ విషయంలో నాన్న స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమాను ఆయన నిర్మించడంతో పాటు అన్ని సరిగ్గా ఉండేలా చూసుకుంటున్నారు.

Videos similaires